కుమురం భీం జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మృతి చెందింది. మోర్లే మల్లేష్, సంతోషి దంపతులకు ఇద్దరు పిల్లలు. మంచిర్యాల పట్టణంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజులక్రితం కన్నెపల్లికి వచ్చిన దంపతులు ఇంటిపనుల్లో నిమగ్నమై ఉండగా పావని ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడింది. పాప కనిపించకపోవడంతో ఇంటి పరిసరాల్లో వెతికారు. తొట్టిలో విగతజీవిగా కనిపించిన పాపను చూసి తల్లిదండ్రులు బోరుమన్నారు.
ఇవీ చూడండి:పరీక్ష రాస్తూనే మృత్యు ఒడికి..