ఖమ్మం గ్రామీణ మండలం గుర్రాలపాడుకు చెందిన రేణు కుమార్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించిన రేణు కుమార్... ఇద్దరూ కలిసి రెండేళ్ల పాటు సన్నిహితంగా ఉన్నారు. తీరా పెళ్లిచేసుకుందామంటే నిరాకరించాడు.
పెళ్లికి నిరాకరించాడని పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రేణు కుమార్కు కౌన్సిలింగ్ ఇచ్చారు. మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి కూడా పురుగుల మందు తాగింది. యువకుడి మృతదేహాన్ని మార్చురీకి, యువతిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: ప్రగతిలో భేష్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ: గవర్నర్