పేదలు నివసించే ప్రాంతాలను ఆత్మగౌరవ కాలనీలుగా అభివృద్ధి చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కాలనీలో సీపీఐ నేత పువ్వాడ ఉదయ్ కుమార్ విగ్రహాన్ని తన తండ్రి మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.
ఖమ్మం నగరంలో పేదలు నివసించే ప్రాంతాలను మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్లు ఇస్తుంటే కొంత మంది దొంగలు భూకబ్జాలతో స్థలాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంతో పాటు కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా పేదలకు అండగా నిలవాలన్నారు.
ఇదీ చూడండి: 'మాతృభాషను ప్రేమిద్దాం.. మన సంస్కృతిని కాపాడదాం'