అర్హులైనవారందరికీ డబుల్బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం... ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం నగరంలోని ధంసలాపురం, అల్లీపురం ప్రాంతాల్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.
ఖమ్మం నగరంలో ఏడాదికి 2 వేల మందికి ఇళ్లు ఇస్తామని చెప్పి.... ఏడేళ్లలో కేవలం 417 మందికి మాత్రమే అందజేశారని పేర్కొన్నారు. నగరంలో ఉన్న పేదలందరికీ గృహాలు మంజూరు చేస్తామని చెప్పిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్... హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: పంటల బీమా.. రైతులకేదీ ధీమా..