ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లోని బస్టాండ్ ఎదుట సీఐటీయూ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు బలిదానాలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండారి శేఖర్ అన్నారు. ఈనెల 19న జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి : కశ్మీర్లో పోస్ట్‌పెయిడ్ మొబైల్ సేవల పునరుద్ధరణ