ETV Bharat / state

రైతులపై రాష్ట్ర ప్రభుత్వానిది మొసలి కన్నీరు: పొన్నం - హుజురాబాద్​లో కాంగ్రెస్​ ధర్నా

రైతుల పట్ల తెరాస సర్కారు ద్వంద వైఖరిని అవలంభిస్తుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని కోరుతూ హుజురాబాద్​లో ఆందోళన చేపట్టారు.

Ponnam Prabhakar elligate on telangana government sheds crocodile tears over farmers
రైతుల పట్ల ప్రభుత్వం మెుసలి కన్నిరు కారుస్తోంది: పొన్నం ప్రభాకర్
author img

By

Published : Jan 4, 2021, 6:09 PM IST

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల మొసలికన్నీరు కారుస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిన సీఎం కేసీఆర్‌, దిల్లీకి వెళ్లొచ్చాక ఎందుకు సమర్ధిస్తున్నాడో ప్రజలకు చెప్పాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో బెన్‌ షలోమ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికే చెందుతుందన్న ఆయన రైతుల పట్ల తెరాస సర్కారు ద్వంద వైఖరిని అవలంభిస్తుందని ఆరోపించారు. నిర్భంధ వ్యవసాయంతో రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యారన్న పొన్నం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులు ముద్దసాని కశ్యప్‌రెడ్డి, పొల్నేని సత్యనారాయణ, పత్తి క్రిష్ణారెడ్డి, కోండ్ర నరేష్‌, బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : ఆ విద్యార్థులకు మంత్రులు కేటీఆర్‌, సబిత ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.