ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని గొప్పలు చెప్పడమే తప్ప.. ఆచరణలో మాత్రం చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందే రైతుబంధు పథకం డబ్బు.. రైతుల ఖాతాల్లో జమ చేశారని ఆయన ఆరోపించారు. ఖరీఫ్‌కు సంబంధించి దాదాపు 60లక్షల ఎకరాలకు రైతుబంధు డబ్బు ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులకు రుణమాఫీ అనే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తన డైరీ నుంచే తొలగించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లిస్తే తప్ప బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సర్కారు వెంటనే ధాన్యంతో పాటు పత్తి కొనుగోలు వెంటనే ప్రారంభించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..