ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 17 వేల పడకలు అందుబాటులో ఉంటే...తమ ప్రభుత్వం వచ్చాక మరో 5 వేల పడకలు అందుబాటులోకి తెచ్చామని మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. వైరల్ జ్వరాలు, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల పట్ల... అన్ని ఆసుపత్రులలో తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల సెలవులు కూడా రద్దు చేశామన్నారు. తెలంగాణలో వైద్యుల కొరత ఉండకూడదని 4 కొత్త వైద్య కళాశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారే అవకాశం ఉందని చెప్పారు. కేరళ, తమిళనాడు తర్వాత ఆరోగ్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
'అన్ని సౌకర్యాలతో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం'
తెలంగాణలో వైద్యుల కొరత ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ 4 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారని మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ పద్దులపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.