ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇంటి ముందు వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ఇంటర్ బోర్డు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా