ETV Bharat / state

గాల్లో తేలుతున్న ఫ్లెక్సీలు... పట్టించుకోని నిర్వాహకులు... - కరీంనగర్​లో ప్రమాదకరంగా ఫ్లెక్సీలు

గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే.. అన్న పాట గుర్తొస్తోంది... కరీంనగర్​లో ఫ్లెక్సీల పరిస్థితి చూస్తుంటే..! గాలి దూమారం వస్తే చాలు... ట్రాన్స్​కో అధికారుల గుండెలు ఝల్లుమనే పరిస్థితి నెలకొంటోంది. వ్యాపార ప్రచారంతో పాటు రాజకీయ ప్రచారానికి వినియోగించే ఫ్లెక్సీలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రధాన రహదారుల్లోనే కనిపించే ఫ్లెక్సీలు చిరిగిపోయి సమీపంలోని విద్యుత్​ తీగలపై పడుతుండటం వల్ల గంటల కొద్ది కరెంటు సరఫరాలోని అంతరాయం ఏర్పడుతోంది.

పొంచి ఉన్న ప్రమాదం...
పొంచి ఉన్న ప్రమాదం...
author img

By

Published : Jun 16, 2020, 7:50 AM IST

కరీంనగర్​ నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రహదారులు, కూడళ్లలో ఉన్న భవనాలపై పెద్దపెద్ద ప్రచార హోర్డింగులు కనిపిస్తుంటాయి. ప్రజలను ఆకర్షించేందుకు వాణిజ్య సంస్థలు... ఆకర్షనీయంగా కనిపించేందుకు వీలుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. వాణిజ్యసంస్థలతో పాటు విద్యాసంస్థలు సొంతంగా కొందరు అద్దెకు తీసుకుని ప్రచారబోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. నగరపాలక సంస్థకు ఏడాది చొప్పున ఫీజులు చెల్లిస్తుండగా.. ఆ బోర్డులు ఏర్పాటు చేసేప్పుడు మాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఫ్లెక్సీలు బిగిస్తున్న క్రమంలో సరైన విధానం పాటించకపోవడం వల్ల చిన్నపాటి గాలులు వీచినా ఆ ఫ్లెక్సీలు గాల్లో వేలాడుతున్నాయి. గతేడాది గాలి దుమారం రావడం వల్ల ఫ్లెక్సీకి కట్టిన రాళ్లు కిందపడి ఓ యువకుడికి గాయాలయ్యాయి. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా... వీటిపై నియంత్రణ కరవైంది.

అధికారుల నిర్లక్ష్యం

ప్రచారబోర్డులను ఏర్పాటు చేసేందుకు పై అంతస్తుల భవన యజమానులు అద్దెకు ఇస్తుండగా.. సంస్థలు సైతం రద్దీ కూడళ్లలో పోటీపడి హోర్డింగు‌లు నిర్మిస్తున్నారు. వాస్తవంగా భవన సామర్థ్యం పరీక్షలు చేయాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించడం లేదు. ఇప్పటి వరకు ఎన్ని భవనాలకు పరీక్షలు చేశారనే వివరాలు కూడా నగరపాలికలో లేవంటే పరిస్థితి ఏ స్థాయి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల నగరంలో భవనాలపై ప్రచార బోర్డులు టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఫ్లెక్సీల నిషేధం మాత్రం కాగితాలకే పరిమితమైంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.

పొంచి ఉన్న ప్రమాదం

నగరంలో ప్రచార హోర్డింగులు, బోర్డులపై ఉన్న ఫ్లెక్సీలు గాలి దుమారం వచ్చిందంటే చాలు చిరిగిపోవడమే కాకుండా గాలికి ఎగిరి వచ్చి విద్యుత్‌ తీగలపై పడుతున్నాయి. ఫలితంగా గంటల కొద్ది కరంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. నగరంలో ఏ ప్రాంతంలో ఫ్లెక్సీలు పడిపోయిందో తెలుసుకోవడానికి గంటల సమయం పడుతుందని ట్రాన్స్‌కో అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో విద్యుత్ స్తంభం సమీపంలో కాకుండా రెండు విద్యుత్‌ స్తంభాల మధ్య తీగలపై పడిపోవడంతో రాత్రి వేళ్లలో గంటల కొద్ది కరంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.మరికొన్ని సార్లు ఫ్లెక్సీలు చిరిగిపోయి వచ్చి వాహన చోదకుల ముఖాలపై పడుతున్నాయి. దీనితో అనేక సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫ్లెక్సీలు కట్టడం వరకు మాత్రమే ప్రచార కర్తలు పట్టించుకుంటారని.. ఆ తర్వాత ఫ్లెక్సీలు చిరిగిపోయినా విద్యుత్ తీగలపై పడిపోయినా పట్టించుకొనే వారుండరని.. ట్రాన్స్​కో అధికారులు చెబుతున్నారు. ఎత్తైన తీగలపై ఎగిరి వచ్చిపడకుండా నగరపాలక సంస్థ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: మాస్కు లేకుండా పెళ్లి వేడుకకు హాజరైన ఆరోగ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.