కరీంనగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విధులకు హాజరు కాని వారి గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సూపరింటెండెంట్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాని ఎనిమిది మందిపై నివేదిక పంపాలని ఆదేశించారు. నివేదికను వైద్యవిధాన పరిషత్ కు పంపి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు.
ఇదీ చూడండి :ఎల్‌ఎండీకి చేరుతున్న కాళేశ్వర గంగ