ETV Bharat / state

జహీరాబాద్​ బాద్​ షా ఎవరు?

జహీరాబాద్ లోక్​సభ పోరులో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది. తెరాసకు 12 నుంచి 16 సీట్లు వస్తాయని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. మరి జహీరాబాద్​ను గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందా? లెక్కతప్పి వేరే పార్టీ గెలుస్తుందా?

zaheerabad
author img

By

Published : May 20, 2019, 10:34 PM IST

జహీరాబాద్​ లోక్​సభ విజేత ఎవరు?

జహీరాబాద్ పార్లమెంట్ 2009లో ఏర్పడింది. మొదటిసారి కాంగ్రెస్​కు... రెండోసారి తెరాసకు అవకాశం కల్పించారు ఓటర్లు. ముడోసారి జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్ బాద్​ షా ఎవరన్నది ఆసక్తిగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు అంచనాలు వేసుకుని... గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు.

2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఈ స్థానాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. తెరాస అభ్యర్థి యూసుఫ్ అలీపై స్వల్ప మెజార్టీతో సురేష్ షెట్కార్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్.. సిట్టింగ్ ఎంపీ సురేష్ షెట్కార్​పై లక్షా నలభై వేలకు పైగా ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింట... ఆరు స్థానాలు తెరాస కైవసం చేసుకుంది. కేవలం ఒక్క ఎల్లారెడ్డిలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అనంతర పరిణామాలతో... ఇక్కడ గెలిచిన జాజాల సురేందర్ కారెక్కారు.

సంక్షేమమే బలంగా

రెండోసారి గెలుపే లక్ష్యంగా సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ బరిలో నిలిచారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. ఆరుగురు తెరాస ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సురేందర్‌ మద్దతు... స్థానికంగా బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందడం వంటివి... తనును గెలుపు గుర్రం ఎక్కిస్తాయన్న ధీమాతో బీబీ పాటిల్ ఉన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలే గెలిపిస్తాయని కాంగ్రెస్ ధీమా

2014 ఎన్నికల్లో భాజపా మద్దతుతో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌ మోహన్‌రావు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీ నుంచి బరిలోకి దిగారు. ప్రధానంగా యువత, నిరుద్యోగ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం సాగించారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిచయాలు... మైనార్టీ ఓటు బ్యాంకు, ఉపాధి కల్పినకు చేస్తున్న కార్యక్రమాలు, ప్రచారంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తనకు కలిసోస్తాయన్న ఆశతో ఉన్నారు మదన్ మోహన్ ఉన్నారు.

భాజపా ప్రభావం చూపేనా

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస... కాంగ్రెస్​కు వచ్చిన ఓట్ల మధ్య స్వల్ప తేడానే ఉండటంతో... గెలుపుపై ఇరు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఎవరికి వారు... గెలుపు తమదే అన్న ధీమతో ఉన్నారు. భాజపా అభ్యర్థి లక్ష్మారెడ్డి... మోదీ మానియాతో గెలుస్తానని అంటున్నప్పటికీ... ప్రధాన పోటీ కాంగ్రెస్, తెరాస మధ్యే ఉండనుంది. మరికొన్ని గంటల్లో ఓటరు తీర్పు తేలనుంది.

ఇదీ చూడండి: భువనగిరి ఖిల్లాపై ఎగిరే జెండా ఎవరిది...?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.