కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ వద్ద ఖాతాదారులు ఎటువంటి భౌతిక దూరం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వరుసలో నిల్చున్నారు. బ్యాంక్ సిబ్బంది వారిని దూరం పాటించాలని ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొని కరోనా వ్యాధి ప్రబలకుండా స్వతహాగా ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను పాటించాలి.
కరోనా కట్టడిలో అన్నింటికంటే ముఖ్యం భౌతిక దూరం. కానీ బయటకు వస్తున్న వారిలో అధిక శాతం మంది ఈ దూరాన్ని పాటించడంలేదు. మార్కెట్, దుకాణం, ఆస్పత్రి, ఉద్యోగం ఇలా బయటకు ఎక్కడికి వెళ్లినా భౌతిక దూరాన్ని పాటించడం మర్చిపోవద్దు.