కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో వానాకాలం - 2020 సాగుపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు నియంత్రిత పద్ధతిలో సాగు చేసే విధానాన్ని అలవాటు చేసుకోవాలని కలెక్టర్ శరత్ కుమార్ సూచించారు. రైతులందరు సంఘటితం కావాలని.. వేసిన పంట వేయకుండా కొత్త రకం కొత్త పంటను సృష్టించాలని పేర్కొన్నారు.
90% సన్న బియ్యం
మార్కెట్ లో ఉన్న డిమాండ్ మేరకు పంటలు పండించాలని కర్షకులను కోరారు. మైలారంలోని రైతులందరూ ఈ సంవత్సరం వానా కాలంలో 90% సన్న బియ్యం పండిస్తామని కలెక్టర్కు తెలియ జేశారు. మిగిలిన 10 శాతంలో పోడు భూములు ఉండటం వలన ఆ భూమికి తగ్గ పంట ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి ఏడాది వేసిన పంట వేయకుండా పంట మార్పిడి చేసే పద్ధతిని అవలంబించాలని కలెక్టర్ కోరారు.
ఇదీ చూడండి: మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ