మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించేందుకుగానూ ప్రైవేట్ అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నామని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసర సేవల కోసం జిల్లా యంత్రాంగం ద్వారా 3 ప్రైవేటు అంబులెన్సులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒకటి చొప్పున 11 ప్రైవేట్ వాహనాలను అద్దెపై తీసుకొని ఆయా ప్రాంతాల్లో పెట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ శృతి ఓఝా అన్నారు.
గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారులతో లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవల కోసం ఈ వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు. ఆలస్యం అయిందని వైద్యులు రోగులను ఇతర ఆస్పత్రులకు పంపిస్తే ఉపేక్షించేది లేదని వైద్య అధికారులను జిల్లా పాలనాధికారి శృతి ఓఝా హెచ్చరించారు.
ఇవీ చూడండి: మామిడి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి