జోగులాంబ గద్వాల జిల్లా గట్టు పీహెచ్సీలో వసతులు లేక గర్భిణులు అవస్థలు పడ్డారు. సరైన వైద్యం అందక మృత్యువాత పడిన ఘటనలూ ఉన్నాయి. సరైన వసతులు లేక గర్భిణులను పాలమూరు, హైదరాబాద్కు వెళ్లమని రిఫర్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పీహెచ్సీలో ఈనెల 6న ఒక్కరోజే 15 గంటల్లో 8 కాన్పులు చేసి గట్టు పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది రికార్డు నెలకొల్పారు.
ఈనెల 5న రాత్రి 8 మంది గర్భిణులు కాన్పు కోసం రాగా.. వైద్యాధికారి రాజసింహ ఆధ్వర్యంలో అప్పటికప్పుడే ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం వరకు మొత్తం 8 మంది ప్రసవాలు పూర్తి చేశారు. 15 గంటల్లో 8 కాన్పులు చేసి రికార్డు నెలకొల్పారు. ఇందులో నలుగురు మగ, నలుగురు ఆడ శిశువులు జన్మించారని వైద్యాధికారి రాజసింహ తెలిపారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. గతంలో 6 కాన్పులు చేశామని చెప్పారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా