జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రెండవ రైల్వే గేటు సమీపంలో వర్షాలకు పాడైన రోడ్లకు మరమ్మతులు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. ప్రభుత్వం పనితీరును నిరసిస్తూ... రోడ్డుపై వరినాట్లు వేశారు. సర్కారు వెంటనే అభివృద్ధి పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : లక్షల్లో లావాదేవీలు... కోట్లలో స్వాహా