జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూపిరెడ్డిపల్లిలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. స్థానిక శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
కౌసల్యా సుతుని పరిణయానికి మాజీ శాసనసభాపతి మధుసూదనచారితో పాటు భారీగా భక్తులు హాజరయ్యారు. రామనామ కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.