ETV Bharat / state

కాళేశ్వరానికి కలెక్టర్లు... ఉత్సాహంగా స్వీయ చిత్రాలు - medigadda

ఒక్కరోజు పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్లు... ఓ అద్భుత నిర్మాణమని కొనియాడారు. సందేహాలు నివృత్తి చేసుకొని, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై ఉత్సాహంగా స్వీయ చిత్రాలు దిగారు.

కాళేశ్వరానికి కలెక్టర్లు... ఉత్సాహంగా స్వీయ చిత్రాలు
author img

By

Published : Aug 29, 2019, 12:07 AM IST

Updated : Aug 29, 2019, 7:47 AM IST

కాళేశ్వరం ఓ అద్భుత నిర్మాణమని కలెక్టర్లు కొనియాడారు. విజ్ఞానయాత్రకు వచ్చిన విద్యార్థుల్లా... నిశితంగా ప్రాజెక్టును పరిశీలించారు. సందేహాలను ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లుని అడిగి నివృత్తి చేసుకున్నారు. వివిధ దశల్లో సాగే గోదావరి జలాల ఎత్తిపోతల గురించి అడిగి తెలుసుకున్నారు. శిరస్త్రాణాలు ధరించి కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్​ కిందకు వెళ్లి మోటార్లను, కంట్రోల్ రూంను పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద గ్రూపు ఫొటో దిగిన కలెక్టర్లు... మేడిగడ్డ బ్యారేజీపై ఉత్సాహంగా స్వీయ చిత్రాలు తీసుకున్నారు.

మండుటెండనూ లెక్కచేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పరిసరాల్లో కలెక్టర్లు ఉత్సహంగా కలియతిరిగారు. ఒకటో పంపు నుంచి గోదావరి జలాల విడుదలను ప్రత్యక్షంగా చూసి అబ్బురపడ్డారు. అంతకుముందు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. బీడువారిన భూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రాజెక్టును సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు బృందానికి సారథ్యం వహించిన రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

కాళేశ్వరానికి కలెక్టర్లు... ఉత్సాహంగా స్వీయ చిత్రాలు

ఇదీ చూడండి: ప్రత్యేక బస్సులో నేడు కాళేశ్వర సందర్శనకు జిల్లా కలెక్టర్లు

sample description
Last Updated : Aug 29, 2019, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.