ఇంటికెళ్లాకుండానే... అనంతలోకాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుమార్తె పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన తండ్రి... రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన కౌశెట్టి గౌరయ్య... ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. గౌరయ్య మృతితో కుంటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి:ఇలా కూడా మోసం చేస్తారా?