జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలో వితంతువులకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... కుట్లు, అల్లికల్లో శిక్షణ ఇచ్చి సేవా సదన్ అనాథాశ్రమం నిర్వాహకులు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
గత పద్నాలుగేళ్లుగా ఆశ్రమాన్ని నడుపుతున్నామని.. ఎంతో మంది వృద్ధులకు, వితంతువులకు సేవ చేస్తున్నందుకు నిర్వాహకుడు విల్సన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్