చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి వేడుకలను స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రజలు వైభవంగా నిర్వహించుకున్నారు. స్టేషన్ ఘనపూర్‌లో నిర్వహించిన జమ్మి పూజ కు స్థానిక శాసనసభ్యుడు తాటికొండ రాజయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి ఆకులను ఒకరికొకరికి పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. ఊరేగింపులో ఎమ్మెల్యే డప్పు కొట్టి అందరిని ఉత్సాహపరిచారు.
ఇవీ చూడండి: రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజలు