ఏసు ప్రభువు చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని నిర్మలా మాత చర్చి నుంచి క్రైస్తవులు శిలువను మోస్తూ.. జలాశయం వద్దకు చేరుకున్నారు. మార్గమధ్యలో ఎమ్మెల్యే కొద్దిసేపు శిలువను మోశారు. ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రశాంతంగా జీవించాలని కోరారు.
ఇవీ చూడండి: ఫొటోలు తీసుకుంటూ నీటిలో పడిపోయారు