ETV Bharat / state

ప్రజలు ఆదరిస్తున్నా.. పరిష్కారం అంతంతే..!

నన్ను మన్నించండి నా శ్రేయోభిలాషులారా..! మీ సమస్యకు పరిష్కారం కోసం నన్ను మీరు సంప్రదించారు. నేనూ మీ సమస్య దరఖాస్తును స్వీకరించాను. ఆ ప్రతులను అధికారులకు చేరవేయడం నా బాధ్యత. నాకు అధికారులు తాత్కాలికంగా పెట్టిన పేరు ఫిర్యాదుల పెట్టె. నా అసలు పేరు ప్రజావాణి. జిల్లా నలుమూలల నుంచి ఎంతోమంది ప్రజలు ప్రతి సోమవారం తమ బాధలను నాతో పంచుకునేవారు. కరోనా సంక్షోభంతో కొన్ని నెలలుగా ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయి ప్రజల నుంచి విమర్శల తాకిడి ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలను స్వీకరించేందుకు ఇటీవలే నాకు ఆ బాధ్యతను అప్పగించారు.

ప్రజలు ఆదరిస్తున్నా.. పరిష్కారం అంతంతే..!
ప్రజలు ఆదరిస్తున్నా.. పరిష్కారం అంతంతే..!
author img

By

Published : Aug 25, 2020, 11:25 AM IST

* జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఓ మహిళ తన ఇంటి ముందు డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంటుందని సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టింపు కరవైందని ఫిర్యాదుల పెట్టెలో దరఖాస్తు సమర్పించింది. నెల గడిచినా ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

* జనగామ జిల్లా కేంద్రానికి చెందిన సామాజికవేత్త పట్టణంలోని రోడ్ల దుస్థితిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కొన్ని రోజుల క్రితం కలెక్టరేట్‌లోని ఫిర్యాదుల పెట్టెలో దరఖాస్తు సమర్పించాడు. నాటి నుంచి నేటి వరకూ రోడ్లన్నీ యథాస్థితిలో ఉన్నాయని ఎన్ని సార్లు విన్నవించినా రోడ్లకు మోక్షం కలగడంలేదని వాపోతున్నాడు.

పరిష్కారం అంతంతే..!

కరోనా కాలంలోనూ నా రక్షణ మరిచి మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం ఎంతో పరితపిస్తున్నాను. మీరు నాకిచ్చిన దరఖాస్తులను ఒకరోజు తర్వాత చూసి వాటిని సంబంధిత అధికారులకు పంపుతున్నారు. కొన్ని మండలాల్లో అయితే వారం రోజుల తర్వాత దరఖాస్తులను తెరిచి పరిశీలన చేపడుతున్నామని అంటున్నారు. ఫిర్యాదులు అధికంగానే వస్తున్నా పరిష్కారం తక్కువ అవుతున్నాయని దిగులుగానే ఉంది. పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో మా ఉన్నతాధికారులు విఫలమవుతున్నారని భావించే ఉండొచ్ఛు కానీ నేను స్వీకరించిన దరఖాస్తుల్లో తక్షణ పరిష్కారం అయ్యేవి ఒకటి, రెండు మాత్రమేనని మిగతావి ప్రభుత్వ ఆధీనంలోనివేనంటూ నా పై అధికారులు చెబుతున్నారు. చిన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని, కరోనాతో సిబ్బంది హోంక్వారంటైన్‌లో ఉండడం వల్ల సిబ్బంది కొరతతో దరఖాస్తుల పరిశీలన జఠిలం అవుతుందని అధికారులు అంటున్నారు.

కరోనా నిబంధనలు పాటించండి..!

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకే మీకోసం తాత్కాలిక పరిష్కార వేదికగా నన్ను నియమించారు. నావంతు బాధ్యతగా మీ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మీరు కూడా కరోనా నిబంధనలను పాటిస్తూ, నాకు అడుగు దూరంలో ఉండి తమ అర్జీలను అందించండి.. అప్పుడే మీరు సురక్షితం, నేను సురక్షితంగా ఉండగలను. నేను మీ సమస్యను పరిష్కరించేందుకు పాటుపడుతా.. మీరు సైతం కరోనా నిబంధనలను విస్మరించకండి..!

స్పందన లేకపోవడంతో.. నేరుగా..

కొన్ని మండలాల్లో నేను స్వీకరించిన దరఖాస్తులకు ఎలాంటి స్పందన రాకపోవడంతో నన్ను నమ్ముకొని ఫలితం లేదనుకుని అధికారులకే నేరుగా తమ దరఖాస్తులను అందజేస్తున్నారు. దాంతో నాకు విలువ లేకుండా పోతుంది. నాకు దరఖాస్తులను అప్పగించినా వారు తెరచి చూసిన దాఖలాలు లేవని అర్థమవుతోంది. ఎందుకంటే సత్వరమే పరిష్కారం అయ్యే దరఖాస్తులపట్ల మా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుస్తుంది. అధికారుల తప్పిదాన్ని నా తప్పిదంగా చూడకుండా మీకే సమస్య ఉన్నా నాతో పంచుకోండి. నా బాధ్యతగా మీ అర్జీని సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్తా. లేదంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి అయినా మీకు ప్రత్యామ్నాయమైనా చూపించేందుకు కృషి చేస్తా.

ఇదీ చూడండి: కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.