జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాలలో శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి కల్యాణం కన్నులపండువగా జరిగింది. స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వాదళార్చన పూజలను నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్వవం ఘనంగా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు స్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ ఘట్టానికి భారీగా భక్తులు హాజరయ్యారు.
ఇవీ చూడండి: పెళ్లి మండపం నుంచి వచ్చి ఓటేశారు