తెలంగాణ సర్కారు రైతు పక్షపాతి అనేందుకు... మొక్క జొన్న పంటను కొనుగోలు చేయటమే సీఎం గొప్ప నిదర్శనమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ అన్నారు. అందుకు ఎమ్మెల్యే... కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మక్క రైతులపై కపట ప్రేమ చూపిస్తున్న భాజపా నాయకులు కేంద్రం మొక్కజొన్నలను విదేశాల నుంచి ఎందుకు దిగుమతి చేస్తుందో చెప్పాలన్నారు.
మొక్కజొన్న రైతులను రాజకీయ పక్షాలు రెచ్చగొట్టి ధర్నాలకు ప్రోత్సహించటం సరికాదన్నారు. గతేడాది మక్క పంటతో రాష్ట్రప్రభుత్వం నష్టపోయినప్పటికి అన్నదాతలు ఇబ్బంది పడకూడదని కొనుగోలు చేశామన్నారు. కర్షకుల పక్షాన మాట్లాడే నిజామాబాదు ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన విషయంపై సమాధానం చెప్పిన తర్వాతే ఈ అంశంపై మాట్లాడాలని డిమాండు చేశారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఒత్తిడి చేశారు: ఎల్.రమణ