కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం విధిగా ఆచరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రజలను కోరారు. జగిత్యాల గ్రామీణ మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. బాధితులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజు, తహసీల్దార్ దిలీప్ నాయక్, పలువురు వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. 'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రభుత్వానికి సహకరించాలి'