రాష్ట్ర ఆడపడచులకు సీఎం కేసీఆర్ ఇస్తున్న కానుక బతుకమ్మ చీరలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బతుకమ్మ పండుగను ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుతుందని ఆయన తెలిపారు.
జగిత్యాల పట్టణంలోని 34, 43, 44వార్డుల మహిళలకు స్థానిక గీతాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ బోగ శ్రావణితో కలిసి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు బతకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: దసరా రోజున రైతు వేదికలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు: మంత్రి ఎర్రబెల్లి