ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. ఈ నెల 27న ఫలితాలు విడుదల చేస్తే ఛైర్మన్ల కోసం నిర్వహించే పరోక్ష ఎన్నికల్లో అక్రమాలు జరుగుతాయని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. లెక్కింపు ప్రక్రియకు, ఛైర్మన్ల ఎన్నికకు స్వల్ప విరామం ఉండేలా చూడాలని అఖిలపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. అలా చేయాలంటే పంచాయతీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందన్న ఈసీ... దీనికి సంబంధించిన ప్రతిపాదనను సర్కారుకు పంపింది.
త్వరలో ప్రకటన
ఓట్ల లెక్కింపు తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను కొనసాగించాలని డీజీపీకి సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి : సూరత్ అగ్నిప్రమాదంలో 20 మంది విద్యార్థుల మృతి