సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 40 రోజుల్లో రూ. 10 లక్షల 90 వేల ఆదాయం హుండీ ద్వారా చేకూరినట్లు ఆలయ నిర్వాహణాధికారి వెల్లడించారు.
అధికారులు, భక్తులు, ఆలయ నిర్వాహకుల సమక్షంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హుండీ లెక్కింపు జరిగింది. కరోన దృష్ట్యా.. సామాజిక దూరాన్ని పాటిస్తూ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. గత నెల 11 వ తేదీ నుంచి నేటి వరకు హుండీ ఆదాయం మెత్తం.. రూ. 10 లక్షల 90 వేలకు చేరిందని స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: చైనా దళాల చొరబాటు వార్త అవాస్తవం