పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే ధ్యేయంగా పార్టీ కార్యకర్తలు అందుకనుగుణంగా పనిచేయాలని ఎంపీ రేవంత్‌రెడ్డి సూచించారు. కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో పలువురు తెరాస కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి తనను నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఇదీ చూడండి : 'హిందువుల తడాఖా చూపిస్తాం': ఎంపీ బాపురావు