హైదరాబాద్ ముషీరాబాద్‌లో తెరాస కార్యకర్తలు, నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రాంనగర్ తెరాస డివిజన్ అధ్యక్ష పదవి ఎన్నికలో వేదికపై నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే గోపాల్, ఇంఛార్జీ రాంబాబు యాదవ్ సమక్షంలో అధ్యక్షుడి ఎన్నిక జరగ్గా... అధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేశారు. వారి అరుపులు, కేకలతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే కేటీఆర్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం ఉంటుందని రాంబాబు యాదవ్ కార్యకర్తలకు నచ్చజెప్పారు.
ఇదీ చూడండి : చంపేశారు.. ప్రమాదంగా చిత్రీకరించారు.. 4 ఏళ్లకు దొరికారు!