రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై భాజపా అసత్య ప్రచారం చేస్తోందని ఎంపీ రంజిత్రెడ్డి మండిపడ్డారు. లాక్డౌన్ ఎత్తివేశాక కరోనావ్యాప్తి పెరగడం సహజమని పేర్కొన్నారు. భాజపా పాలిత ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా వచ్చిందంటే తాము ప్రజల్లో ఉన్నామని చెప్పారు. కలిసి పోరాడాల్సిన సమయంలో రాజకీయాలు చేయడం తగదంటూ రంజిత్ రెడ్డి హితవు పలికారు.
రైతు బంధు డబ్బులు ఎగ్గోడతారని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయని... ఇప్పుడేం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. కేసీఆర్ను అనవసరంగా విమర్శిస్తే భాజపాకు రైతులే గుణపాఠం చెబుతారన్నారు.
ఇదీ చూడండి: భాజపా నాయకులవి చిల్లర రాజకీయాలు: మంత్రి తలసాని