భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెరాస నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు.
అన్ని వర్గాల ప్రజలకు సుముఖత..
రాజధాని నగరంలో భారీ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని ఎమ్మెల్యే గోపాల్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో అనేక ప్రజా ప్రయోజన బిల్లులను తీసుకు రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు గోపాల్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : అత్తింటి నుంచి వివాహిత అదృశ్యం.. పోలీసులకు భర్త ఫిర్యాదు