Tirupati Venkateswara Swamy: నవంబర్ 1 నుంచి తిరుపతిలో టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. టైంస్లాట్ టోకెన్లు తీసుకున్న భక్తులకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనే సమయాన్ని నిర్ణయిస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీటి వల్ల భక్తులు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు. టైంస్లాట్ టోకెన్లు లేని భక్తులకు యధావిధిగా దర్శనం కల్పిస్తామని తితిదే ఛైర్మన్ పేర్కొన్నారు.
తిరుపతి అలిపిరి వద్ద తితిదే ఉద్యోగులకు రూ.54 లక్షలతో నిర్మించిన ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రాన్ని ఈవో ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. డిసెంబర్ 1న ఉదయం 8 గంటల నుంచి 8.30 మధ్య బ్రేక్ దర్శనం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామన్నారు. ముందుగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య అనుకున్నామని.. కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు అదే సమయంలో ఎక్కువగా ఉండటంతో కొద్ది మార్పులు చేశామని ఛైర్మన్ తెలిపారు.
ఇవీ చదవండి: