జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ఉపాధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది సయ్యద్ ముజాహిద్ సుల్తాన్ మూసవి కుటుంబంలో విషాదం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజుల వ్యవధిలో కుటుంబంలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. మూసవితో పాటు అతని తల్లి, భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కరోనా ఏ విధంగా జన జీవితాలను అస్తవ్యస్తం చేస్తుందో చెప్పడానికి ఈ విషాదమే తార్కాణమన్నారు. ఇంతటి విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే సుల్తాన్ మూసవి కుమార్తెకు శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్విటర్లో పేర్కొన్నారు.
-
విజయవాడలో సీనియర్ అడ్వకేట్ సుల్తాన్ ముసావీ కుటుంబంలో 20రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందడం బాధాకరం. ముసావీతో పాటు తల్లి, భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోవడం ఆవేదనను కలిగించింది. కరోనా ఏవిధంగా జన జీవితాలను అస్తవ్యస్థం చేస్తోందో చెప్పడానికి ఈ విషాదమే తార్కాణం. (1/2)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) November 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">విజయవాడలో సీనియర్ అడ్వకేట్ సుల్తాన్ ముసావీ కుటుంబంలో 20రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందడం బాధాకరం. ముసావీతో పాటు తల్లి, భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోవడం ఆవేదనను కలిగించింది. కరోనా ఏవిధంగా జన జీవితాలను అస్తవ్యస్థం చేస్తోందో చెప్పడానికి ఈ విషాదమే తార్కాణం. (1/2)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) November 2, 2020విజయవాడలో సీనియర్ అడ్వకేట్ సుల్తాన్ ముసావీ కుటుంబంలో 20రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందడం బాధాకరం. ముసావీతో పాటు తల్లి, భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోవడం ఆవేదనను కలిగించింది. కరోనా ఏవిధంగా జన జీవితాలను అస్తవ్యస్థం చేస్తోందో చెప్పడానికి ఈ విషాదమే తార్కాణం. (1/2)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) November 2, 2020
ఇదీ చదవండి: 'కేంద్రంతో మాట్లాడకుండా.. బాధ్యతారాహిత్యంగా లేఖ రాస్తారా?'