కొవిడ్ కష్టకాలంలో డెయిరీ, పౌల్ట్రీ పరిశ్రమలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆస్తిపన్నులో మినహాయింపు ఇవ్వాలని పౌల్ట్రీ, డెయిరీ ఉత్పత్తిదారులు ఎప్పట్నుంచో కోరుతున్నారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్నులో మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకొంది. పౌల్ట్రీ, డెయిరీ పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో యూనిట్ కు రూ.2 చొప్పున సబ్సిడీని ఇవ్వనున్నట్లు ఇంధన శాఖ ప్రకటించింది.
జీహెచ్ఎంసీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్ని చోట్లా ఈ మినహాయింపు వర్తించనుంది. ఆస్తిపై హక్కు, ఆస్తిపన్ను రికార్డుల్లో కొనసాగేందుకు వీలుగా ఏడాదికి ఒక్కో యూనిట్ వంద రూపాయలు మాత్రమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు ఉత్తర్వులు జారీ చేయగా... విద్యుత్ యూనిట్ రేటును తగ్గిస్తూ ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమలకు కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలిగే అవకాశముంది.
ఇదీ చూడండి: Vaccine : వ్యాక్సిన్‌తోనే రక్ష.. నిరూపించిన నిజామాబాద్ జీజీహెచ్