ETV Bharat / state

ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నాం: పంచాయతీ రాజ్ ఛాంబర్

గ్రామ, మండల, జిల్లా పరిషత్​లకు నిధులు కేటాయిస్తామని... ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్​లోని ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు.

Telangana Panchayati Raj Chamber meeting in hyderabad
ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నాం: పంచాయతీ రాజ్ ఛాంబర్
author img

By

Published : Feb 10, 2021, 5:53 PM IST

పరిషత్​లకు నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని... తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. గ్రామ, మండల, జిల్లా పరిషత్​లకు నిధులు కేటాయిస్తామని... ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లక్డీకాపూల్​లోని ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు.

కేంద్రం ద్వారా కేటాయిస్తే ఒరిగేదేమీ లేదు...

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... ఫిబ్రవరి 15, 22, 28వ తేదీల్లో ఆత్మగౌరవ సభలను తలపెట్టినట్లు ఆయన చెప్పారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా నిధులు విడుదల చేస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో తమ కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని తెలిపారు. అయితే నిధులను కేంద్ర ఆర్థిక ఆర్థిక సంఘం ద్వారా కేటాయిస్తే మాత్రం కొత్తగా తమకు ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు.

వెంటనే విడుదల చేయాలి...

నిధులను రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా కేటాయించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 73వ రాజ్యాంగ సవరణలోని 29 అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే... తాము భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: త్వరలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తాం: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.