ETV Bharat / state

harish rao: 'ఎయిమ్స్​పై కిషన్​ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారు'

ఎయిమ్స్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy)..వాస్తవాలు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు (health minister harish rao) ఆరోపించారు. ఎయిమ్స్ కు భూమి ఇవ్వలేదని మొన్న ఆరోపించిన కిషన్ రెడ్డి... సంబంధిత పత్రాలు చూపించిన తర్వాత.. ఇప్పుడు భవనాల డాక్యుమెంట్స్, పర్యావరణ అనుమతులు అంటూ రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

harish rao
harish rao
author img

By

Published : Nov 14, 2021, 5:19 AM IST

బీబీనగర్​ ఎయిమ్స్​కు (BB NAGAR AIMS) సంబంధించి కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (union minister kishan reddy) వాస్తవాలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్​రావు (health minister harish rao) ఆరోపించారు. ఎయిమ్స్​ విషయమై ఈ ఏడాది అక్టోబర్ తొమ్మిదో తేదీన సీఎస్ సోమేశ్ కుమార్​కు (cs somesh kumar) కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే, ఆయా శాఖలతో సమన్వయం చేసి వారం రోజుల్లోనే టీఓఆర్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పట్టింపులకు పోకుండా భూమి అప్పగించాలని కిష‌న్ రెడ్డి అన‌డం విస్మయం కలిగిస్తోందని మంత్రి హరీశ్​ రావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే 201 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్​కు అప్పగించిందని... ఆ వివరాలను కూడా మీడియాకు విడుదల చేసినట్లు గుర్తు చేశారు.

ఎయిమ్స్​ కోసం సీఎం కేసీఆర్​ ఎన్నో సార్లు అడిగారు

భవనాల నిర్మాణం వైఎస్ (YS Rajasekhar reddy) హయాంలో పాక్షికంగా జరిగిందన్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 45 కోట్లు ఖర్చు చేసి ఆస్పత్రిని వినియోగం లోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఓపీ, డ‌యాగ్నోస్టిక్ సేవ‌ల‌ను (Diagnostic services) ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రానికి ఎయిమ్స్ కేటాయించాలని కేంద్రప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) పలుమార్లు స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు హరీశ్​రావు గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణాలకు 2,3 ఏళ్ల సమయం పట్టిందని... అయితే రాష్ట్రంలో సిద్ధంగా ఉన్న భవనాలను బదిలీ చేయడంతో ఎయిమ్స్​లో వెంటనే తరగతులు ప్రారంభమయ్యాయని అన్నారు.

అడిగిన వెంటనే అన్ని అనుమతులు ఇచ్చాం

తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎయిమ్స్ విస్తరణ ఇబ్బందికరంగా మారిందన‌ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం పచ్చి అబద్ధమని హరీశ్​ రావు తోసిపుచ్చారు. అవసరమైన భూమిని అప్పగించడంతో పాటు పర్యావరణం (Environmental permission) సహా అన్ని ర‌కాల అనుమ‌తుల‌ను అడిగిన వెంట‌నే మంజూరు చేసినట్లు చెప్పారు. అబద్ధాలు మాట్లాడడం లేదంటూనే కిష‌న్ రెడ్డి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. వైద్యకళాశాలల (Medical college) విష‌యంలో తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పంద‌న లేద‌ని త‌ప్పుడు ఆరోప‌ణ చేస్తున్నారని విమర్శించారు.

వైద్య కళాశాలల కోసం ఎన్నో సార్లు అడిగాం..

వైద్యకళాశాలలు మంజూరు చేయాలని గడచిన ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందని... కేంద్రమంత్రులు జేపీనడ్డా, హర్షవర్ధన్​కు (union minister harshavardan) పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తెలిపారు. తాజాగా కూడా వైద్యకళాశాలల ఏర్పాటు గురించి అడిగామని, అయినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. మొదటి రెండు దశల్లో ఒక్క వైద్యకళాశాలను కూడా తెలంగాణకు మంజూరు చేయని కేంద్ర ప్రభుత్వం... మూడో దశలో నిబంధనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేకుండా చేశారని హరీశ్​ రావు వివరించారు.

ఇదీ చూడండి: Kishan Reddy: కేసీఆర్.. అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపకండి: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.