తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 81,193 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 357 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,56,455కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,865కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 405 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,46,344కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,246 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.