ETV Bharat / state

'వచ్చే రెండు రోజుల్లో మంత్రి మండలి సమావేశం' - కార్మిక సంఘాలతో కమిటీ చర్చలు విఫలం

రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై  మంత్రిమండలిలో చర్చించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. ఈ మేరకు వచ్చే రెండు రోజుల్లో మంత్రివర్గం భేటీ కానుంది.

త్వరలో భేటీ కానున్న మంత్రి మండలి
author img

By

Published : Oct 29, 2019, 6:29 AM IST

Updated : Oct 29, 2019, 7:16 AM IST

తెలంగాణ మంత్రి మండలి సమావేశం ఒకట్రెండు రోజుల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం జారీ చేసిన మోటారు వాహనాల సవరణ చట్టం-2019 అమలు, ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వడం తదితర ప్రతిపాదనలనూ మండలి ఎజెండాలో చేర్చనున్నట్లు తెలిసింది. సోమవారం ఉన్నత స్థాయిలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఆర్టీసీ సమ్మెపై సీఎం స్థాయిలో తరచూ సమావేశాలు జరుగుతున్నప్పటికీ విధాన నిర్ణయాల కోసం మంత్రి మండలిని సమావేశపరచాలని తాజాగా సర్కారు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చివరిసారిగా ఈ నెల మొదటి తేదీన, ఆర్టీసీ సమ్మెకు ముందు మంత్రి మండలి సమావేశం జరిగింది. అందులో సమ్మె నివారణకు ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీని నియమించారు. కార్మిక సంఘాలతో కమిటీ చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 5న సమ్మె మొదలై కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి మండలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి.

ఇవీ చూడండి : నేడు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ

Intro:సికింద్రాబాద్ యాంకర్..దీపావళి సందర్భంగా యాదవులు సాంప్రదాయబద్దంగా నిర్వహించే సదరు సమ్మేళన ఉత్సవాలు ఘనంగా జరిగాయి..పలు రాష్ట్రాల నుంచి వచ్చిన దున్నపోతులను సదరు ఉత్సవాలలో ఆడించారు..ఇందులో భాగంగా సికింద్రాబాద్ టిఆర్ఎస్వి గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ కార్తీక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదరు సమ్మేళనం పెద్ద ఎత్తున జరిగింది ..యాదవుల ఐక్యతను నిదర్శనంగా నిలిచే సదరు సమ్మేళన ఉత్సవాలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు..నగరం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా దున్నపోతులను తీసుకొచ్చి సదర్ సమ్మేళన ఉత్సవాల్లో ఆట ఆడించారు..సదరు లో పెద్ద ఎత్తున యాదవుల తోపాటు వివరాలు కూడా పాల్గొని ఐక్యతను చాటారు..డీజే బ్యాండ్ చప్పులతో నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో సుదర్శన్ దినోత్సవాన్ని నిర్వహించారుBody:VamshiConclusion:7032401099
Last Updated : Oct 29, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.