భూ కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ జరిపించాలని గవర్నర్ తమిళిసైకి సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. భూ కేటాయింపుల్లో అక్రమాలను నిర్ధారిస్తూ సిన్హా కమిటీ నివేదిక ఇచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. సిన్హా కమిటీని కొనసాగించేలా చూడటం వల్ల మరిన్ని భూ అక్రమ కేటాయింపులు బయటకు వస్తాయని పద్మనాభరెడ్డి తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 145 ఎకరాల భూదాన్ భూములను నిబంధనలకు విరుద్ధంగా వినోద్ డెవలప్మెంట్ సొసైటీకి అప్పగించారని చెప్పారు. ఈ విషయాన్ని సిన్హా కమిటీ.. తన నివేదికలో కూడా పొందుపర్చిందని తెలిపారు. వినోద్ డెవలప్మెంట్ సొసైటీ ఆ భూమిని అక్రమంగా ఇతరులకు విక్రయించిందని ఆరోపించారు. భూదాన్ అధ్యక్షులు, సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీలుకోవాలని సిన్హా కమిటీ సూచించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
ఇదీ చూడండి: మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్