నైరుతి రుతుపవనాలు శనివారం కర్ణాటక దక్షిణ ప్రాంతానికి విస్తరించాయి. సోమ, మంగళవారాల్లో రాయలసీమ, కోస్తాంధ్రకు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఈ నెల 10కల్లా తెలంగాణకు రుతుపవనాలు వస్తాయని అంచనా. సోమవారం బంగాళాఖాతం తూర్పు మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందన్నారు.
విదర్భ తూర్పు ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అండమాన్ దీవుల వద్ద సముద్రంలో 3100 మీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రాజారావు తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా