ETV Bharat / state

ప్రచార విధివిధానాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

బల్దియా ఎన్నికల ప్రచారంలో అనుమతి తీసుకోని వాహనాలను జప్తు చేయడంతో పాటు సంబంధిత అభ్యర్థిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రచారంలో రెండుకు మించి వాహనాలు వరుసగా వెళ్లరాదని తెలిపింది. లౌడ్ స్పీకర్లు, మైకులను ఉదయం ఆరు నుంచి రాత్రి పదిగంటల్లోపే వినియోగించాలని స్పష్టం చేసింది.

sec released Campaign rules in ghmc elections
ప్రచార విధివిధానాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
author img

By

Published : Nov 23, 2020, 5:33 AM IST

ప్రచార విధివిధానాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి తీసుకోవాల్సిన అనుమతులు, పాటించాల్సిన విధానాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ప్రచారం కోసం అభ్యర్థులు సంబంధిత డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నుంచి, స్టార్ క్యాంపెయినర్లు జీహెచ్​ఎంసీ కమిషనర్ నుంచి వాహనాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎస్​ఈసీ తెలిపింది. లేదంటే అనధికార వాహనాలుగా పరిగణించి జప్తు చేయడంతో పాటు సంబంధిత అభ్యర్థులు చట్ట ప్రకారం శిక్షకు గురవుతారని స్పష్టం చేసింది. పోలింగ్‌ రోజు అభ్యర్థికి ఒకే వాహనానికి విడిగా అనుమతి ఇస్తామని పేర్కొంది. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. ప్రచారానికి అనుమతించే వాహనాల సంఖ్యపై సంబంధిత అధికారి నిర్ణయం తీసుకుంటారని ఎన్నికల సంఘం పేర్కొంది.

రెండుకు మించి వాహనాలు వరుసగా వెళ్లరాదు

ప్రచారంలో రెండుకు మించి వాహనాలు వరుసగా వెళ్లరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎక్కువ వాహనాలు ఉన్నట్లైతే ప్రతి రెండు వాహనాల మధ్య వంద మీటర్ల దూరాన్ని పాటించాలని తెలిపింది. లౌడ్ స్పీకర్లు, మైకుల వినియోగానికి సంబంధిత అధికారులు, పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని.. ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల్లోపు మాత్రమే వినియోగించాలని ఎస్​ఈసీ వివరించింది. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, న్యాయస్థానాలు, ప్రార్థనా స్థలాలకు వంద మీటర్ల లోపు లౌడ్ స్పీకర్లు, మైకులు ఉపయోగించరాదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారం కోసం ముద్రించే కరపత్రాలు, పోస్టర్లు, హోర్డింగులు, ఫ్లెక్సీలపై ప్రచురణకర్త పేరు, చిరునామా విధిగా ముద్రించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: టీకా అత్యవసర అనుమతులపై కేంద్రం దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.