గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రవీంద్ర భారతిలో లంబాడీ ఐక్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 282 జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు డీకే అరుణ, రామచందర్ రావు, వివేక్, బాబు మోహన్, కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచన, సహకారంతో గిరిజనులకు ప్రాధాన్యత లభిస్తోందని మంత్రి తెలిపారు. బంజారాహిల్స్‌లో 100 కోట్ల విలువైన భూమిని కేటాయించి బంజారా భవన్ నిర్మిస్తున్నారని వివరించారు. తండాలను లంబాడీలు పాలించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించారని ఈటల పేర్కొన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల అమలు... గిరిజన పూజారులకు దీప ధూప ఖర్చులు, పారితోషకం ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: 'ఆంధ్రాలో ఏం చేయలేకనే.. తెలంగాణలో పార్టీ'