ETV Bharat / state

ఈ నెల 27 నుంచి ఎప్పుడైనా సమ్మెలోకి... ఆర్టీసీ ఎండీకి నోటీసు

author img

By

Published : Sep 13, 2019, 11:30 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం, యాజమాన్యం విఫలమవుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​ బస్​ భవన్​లో ఆర్టీసీ ఎండీని కలిసిన కార్మిక సంఘాల నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. సమ్మె నోటీసు నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.

ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం స్పందించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. హైదరాబాద్​ బస్​ భవన్​లో ఆర్టీసీ ఎండీని కలిసిన కార్మిక సంఘ నాయకులు సమ్మె నోటీసును అందజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 2017 నుంచి చేయాల్సిన వేతన సవరణ వంటి అంశాలపై స్పష్టత లేదని సంఘం అధ్యక్షుడు వెంకటాచారి ఆరోపించారు. ఈ నెల 27 నుంచి ఎప్పుడైనా సమ్మెకు దిగవచ్చని అన్నారు. సర్కారు వద్ద ప్రజా ప్రతినిధుల జీత భత్యాలకు లక్షల రూపాయలు ఇవ్వడానికి నిధులుంటాయి కానీ... ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడానికి నిధులుండవని మజ్దూర్​ సంఘం నాయకులు శ్రీనివాస్​ ఎద్దేవా చేశారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రయాణికుల ఆందోళన

సమ్మె నోటీసు నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 27వ తేదీ అనంతరం ఆర్టీసీ బస్సులు నడుస్తాయో.. లేదో అన్న సందిగ్థత నెలకొంది. అటు సమ్మె విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

ఈ నెల 27 నుంచి ఎప్పుడైనా సమ్మెలోకి... ఆర్టీసీ ఎండీకి నోటీసు

ఇదీ చూడండి : ఊరంతా సంబురం... ముగిసిన గణపతి నిమజ్జనం...

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.