భారత్, ఇంగ్లాండ్ జట్లే వచ్చే ప్రపంచకప్‌లో ఫేవరేట్స్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ పేర్కొన్నాడు. గెలిచే అవకాశాలు ఆసీస్‌కూ మెండుగానే ఉన్నాయని స్పష్టం చేశాడు. బాల్ టాంపరింగ్ వివాదంతో సస్పెండైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రాకతో కంగారూ జట్టు బలపడటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రస్తుత ఫామ్‌ని బట్టి చూస్తే భారత్, ఇంగ్లాండ్ జట్లు బలంగా ఉన్నాయని.. స్మిత్, వార్నర్ రాకతో ఆసీస్ కూడా బలపడుతుందని తెలిపాడు. వరుస ఓటములతో ఇబ్బంది పడుతోన్న ఆసీస్ త్వరలోనే గాడిన పడుతుందని కంగారూ జట్టుకు కొత్త అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పాంటింగ్ పేర్కొన్నాడు.
మార్చి 29తో స్మిత్, వార్నర్‌పై సస్పెన్షన్ ముగియనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో సరైన ఆటగాళ్లు అందుబాటులో ఉంటే విజయావకాశాలు పెరుగుతాయని పాంటింగ్ భావిస్తున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో ఆడటానికి ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడతారన్న విషయంపై స్పందిస్తూ.. ప్రస్తుత జట్టులో అలాంటి ఇబ్బందేమీ లేదని ఇంగ్లాండ్ గడ్డపై స్పిన్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుందని ఈ ఆసిస్ మాజీ కెప్టెన్ తెలిపాడు.
ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లే ఫేవరేట్స్
2019 వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లాండ్, భారత్ జట్లే ఫేవరేట్స్ అని ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.