ETV Bharat / state

Revanth reddy Letter to KCR : "జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యులర్‌ చేయాలి"

Revanth Reddy wrote Letter to cm KCR : రాష్ట్రంలో జూనియర్‌ పంచాయతీ సెక్రటరీల ధర్నాలకు ప్రతిపక్ష నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వారికి సంఘీభావం తెలిపి.. వారిని వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని సీఎం కేసీఆర్‌కి లేఖ రాశారు. చేయని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష కార్యచరణకు సిద్దమవుతుందని హెచ్చరించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 9, 2023, 3:54 PM IST

Revanth Reddy wrote Letter to cm KCR : జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్‌ చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే దారుణంగా తయారైందని విమర్శించారు. ఈ మేరకు అయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు జూనియర్ కార్యదర్శుల కష్టంతోనే వచ్చాయనే విషయాన్ని గుర్తు చేశారు.

రేవంత్‌ రెడ్డి డిమాండ్లు:

  • జూనియర్‌ కార్యదర్శులు కోరుకుంటున్న విధంగా వారి ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలి.
  • 4 సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి.
  • కేడర్ స్ట్రెంట్‌తో పాటు సర్వీసును రూపొందించాలి.
  • 010 పద్దు కింద వేతనాలిస్తూ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు అందజేయాలి.
  • చనిపోయిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలి.
  • ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలి.
  • ప్రభుత్వ మహిళా పంచాయతీ కార్యదర్శులకు ఆరు నెలల ప్రసూతి సెలవులు, 90 రోజుల చైల్డ్‌ కేర్ సెలవులు ఇవ్వాలి.

పైన తెలిపిన వాటిని పరిష్కరించాలని అన్నారు. లేకపోతే వారి పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలిచి, వారి తరఫున ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతుందని స్పష్టం చేశారు.

బండి సంజయ్‌ లేఖ: ఈ విషయంలోనే ఈ నెల 3న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి బహిరంగ లేఖ రాశారు. రాష‌్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్‌ చేసే జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ సెక్రటరీలు చేస్తున్న నిరసనకు సంజయ్‌ సంఘీభావం తెలిపారు. పోటీ పరీక్షలు పాసై అన్ని అర్హతలు సాధించిన వారిని.. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయి నాలుగేళ్లయినా రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయమని అన్నారు. అసెంబ్లీలో ప్రొబేషనరీ పీరియడ్ మరో సంవత్సరం పెంచుతున్నట్లు ప్రకటించారని.. అనంతరం పర్మినెంట్‌ చేయాలి కదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ స్పందన: పంచాయతీ కార్యదర్శుల సమస్యను సీఎం కేసీఆర్‌ త్వరలో పరిష్కరిస్తారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. సాయంత్రంలోగా ఉద్యోగాల్లో చేరాలని సూచించారు. ఉద్యోగంలో చేరినప్పుడే ఎటువంటి సమ్మెలు, ధర్నాల్లో పాల్గొనమని, యూనియన్లు ఏర్పాటు చేయమని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిన సంగతి మంత్రి గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.