Bandi sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పంపిన దరఖాస్తులకు అధికారుల నుంచి స్పందన వచ్చింది. ప్రగతిభవన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడ్రస్ చేస్తూ ఆర్టీఐ దరఖాస్తులు పంపించారు. ఆ దరఖాస్తులను సీఎంవో, సీఎస్ కార్యాలయ అధికారులు సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు. ఈమేరకు ఆయా శాఖలకు పంపించినట్టు బండి సంజయ్‌కు అధికారులు ఎక్‌నాలెడ్జ్‌మెంట్ కార్డులను కూడా పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఎన్ని రోజులు ఉన్నారు, ఫామ్‌హౌస్‌లో ఎన్ని రోజులు ఉన్నారు అని ఆర్టీఐ ద్వారా పెట్టిన దరఖాస్తును ప్రొటోకాల్ విభాగానికి, ప్రగతి భవన్ నిర్మాణం, అయిన ఖర్చుకు సంబంధించిన దరఖాస్తును రోడ్లు భవనాల శాఖ, ఆర్థికశాఖ అధికారులకు పంపించారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆర్టీఐకి ఇప్పటికే 88 అంశాలపై దరఖాస్తులు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సందర్భాల్లో చేపట్టిన జిల్లా పర్యటనల నుంచి మొదలుకొని.. శాసనమండలి, శాసనసభలో ఇచ్చిన హామీల వివరాలు కోరారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన అంశాలు, ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులు, పెండింగ్‌లో ఉన్నవెన్ని? ఎన్ని తిరస్కరించారు? పూర్తి సమాచారం ఇవ్వాలని బండి సంజయ్ అడిగారు. ఇప్పటి వరకు ఆర్టీఐకి మొత్తం 88 అంశాలపై 60 అర్జీలు పెట్టారు.
ఇదీ చదవండి: తెరాస సర్కార్‌పై పోరాటానికి భాజపా 'ఆర్టీఐ' అస్త్రం..!
ఆదివాసీల అణచివేతపై రేవంత్ ట్వీట్.. రాహుల్‌గాంధీ రీ-ట్వీట్..