ETV Bharat / state

RATION CARDS:పెండింగ్​లో ఉన్న 4,46,169 మందికి రేషన్ కార్డులు

author img

By

Published : Jun 9, 2021, 5:09 AM IST

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దరఖాస్తు చేసుకుని, పెండింగులో ఉన్న సుమారు 4 లక్షల 46 వేల మందికి పైగా అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రికార్డు స్థాయిలో 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. మిగిలిన సేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. పైలట్ పద్ధతిన భూముల డిజిటల్ సర్వేకు ఆమోదం తెలిపింది.

పెండింగ్​లో ఉన్న 4,46,169 మందికి రేషన్ కార్డులు

కొత్త రేషన్​కార్డుల జారీకి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగులో ఉన్న 4 లక్షల 46 వేల 169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కార మార్గాల సూచనకై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు-టీఎస్​ఎఫ్​పీజెడ్​ల ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

అధిక దిగుబడిపై హర్షం..

వానాకాలం సాగు, వ్యవసాయశాఖ సంసిద్ధతపై సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో సాగు భారీగా పెరగడంపై మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. గతేడాది వానాకాలం, యాసంగి కలిపి కోటి ఆరు లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు ద్వారా సుమారు మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. వానాకాలం సాగు కోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశించింది. ప్రస్తుత యాసంగిలో ఇప్పటికే సుమారు 84 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, మిగిలిన కొద్దిపాటి ధాన్యం కొనుగోళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్, కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

డిజిటల్ సర్వే..

రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ భూములను సమగ్ర డిజిటల్ సర్వే చేయాలని, అందుకోసం తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని మూడు గ్రామాల చొప్పున 27 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలోని 99 శాతం వ్యవసాయ భూములు ఎటువంటి సమస్యలు లేకుండా ధరణిలో నమోదయ్యాయన్న రెవెన్యూ అధికారులు.. సమగ్ర సర్వే పూర్తైతే భూసంబంధిత సమస్యలు ఉత్పన్నం కావని వివరించారు. పట్టా భూములకు ఇంచు తేడా రాకుండా డిజిటల్‌ మ్యాప్‌ ద్వారా రక్షణ లభిస్తుందని చెప్పారు.

ఇదీ చూడండి: corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.